
సాక్షి, హైదరాబాద్: సినీకార్మికుల సమ్మె (Tollywood Cinema Workers Strike) విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.
సమ్మె ఎఫెక్ట్
హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారింది. నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఈరోజు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది.
చదవండి: ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్