breaking news
Telugu Film Industry Employees Federation
-
సినీకార్మికుల సమ్మె.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సినీకార్మికుల సమ్మె (Tollywood Cinema Workers Strike) విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.సమ్మె ఎఫెక్ట్హైదరాబాద్ను సినిమా హబ్‌గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారింది. నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఈరోజు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది.చదవండి: ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్ -
చిన్న నిర్మాతలు పైసా పెంచమంటున్నారు: సి.కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులకు వేతనాలు పెంచే ప్రసక్తే లేదని చిన్న నిర్మాతలు తేల్చి చెప్తున్నారు. గురువారం (ఆగస్టు 7) నాడు ఫిలిం ఛాంబర్లో ప్రముఖ ప్రొడ్యూసర్ సి. కల్యాణ్‌తో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. 30% వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్లపై చర్చించారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు లేకపోతే ఉపాధి లేదు. చిన్న నిర్మాతలు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు. ఒక్క పైసా కూడా పెంచేందుకు వారు సిద్ధంగా లేరు. అలా అని కార్మికులను ఇబ్బంది పెట్టాలని ఏ నిర్మాత అనుకోరు అని చెప్పుకొచ్చాడు.మా బాధ అర్థం చేసుకోరా?30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేరేవరకు షూటింగ్స్‌లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) బంద్ ప్రకటించింది. సమ్మె ఫలితంగా మూడురోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నేడు నాలుగోరోజు సమ్మె కొనసాగుతోంది. సమ్మె మొదలై నాలుగు రోజులవుతున్నా మా బాధ అర్థం చేసుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నెలలో 10 రోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని, సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమాలకు పని చేయించుకుంటున్నారని, సకాలంలో జీతాలు ఇవ్వట్లేదని వాపోయారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే సినీకార్మికులకే జీతాలెక్కువ: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్ (Telugu Film Chamber of Commerce)లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం జరిగిన ఈ భేటిక అల్లు అరవింద్, మైత్రీ రవి, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్ ఠాగూర్ మధు తదితరులు హాజరయ్యారు. కార్మికుల వేతనాలు 30% పెంచాలన్న ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్‌పై చర్చించారు. అనంతరం నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాము. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా వీరి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనాల పెంపు పర్సంటేజ్‌పై ఇంకా చర్చ నడుస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు అని తెలిపారు. ఈ సమావేశానికి మరోవైపు తమ సినిమాలకు పనిచేసే కార్మికులకు 30% వేతనం పెంపునకు అంగీకరిస్తూ కొంతమంది నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్‌కు లెటర్స్ ఇచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు, ఒక సినిమా ఓపెనింగ్, రెండు యాడ్ ఫిలింస్‌కు వర్క్ చేస్తోంది.షూటింగ్స్ బంద్తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేతనాల పెంపు కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా వీరశంకర్, సయ్యద్ హుమాయూన్లను నియమించారు. వేతనాల పెంపు విషయంపై ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్- ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ పేర్కొంది. ఈ మేరకు అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ (అలెక్స్) ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నేటి నుంచి 30 శాతం వేతనం పెంచి ఇస్తామంటూ లేఖ ఇవ్వాలి. ఆ లేఖని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు అందజేసిన తర్వాతే చిత్రీకరణలకు హాజరవుతాం. అప్పటి వరకూ సినిమాలు, వెబ్ సిరీస్ షూటింగ్స్‌కి కార్మికులు ఎవరూ హాజరు కాకూడదు. ఈ రూల్స్ తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగినా వర్తిస్తాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.మనమంతా ఐక్యతతో ఉండాలి: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ తీసుకున్న షూటింగ్స్ బంద్ నిర్ణయంపై ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే... ‘ప్రియమైన నిర్మాతలకు.. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ పక్షపాతంగా 30శాతం వేతనాల పెంపు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు సంబంధిత అధికారులతో ఛాంబర్ చర్చలు జరుపుతుంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశకాలను కచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్ కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అంటూ ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ పేరుతో ఆ లేఖ విడుదలైంది. చదవండి: AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం -
టాలీవుడ్ బందయినా.. జక్కన్న ఆగడు
తెలుగు చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంఘం సోమవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో తెలుగు చిత్రసీమలో షూటింగులన్నీ రద్దవుతున్నాయి. అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బాహుబలి చిత్రం పనులు మాత్రం హైదరాబాద్ నగర శివార్లలో శరవేగంగా సాగిపోతున్నాయి. అందరికీ బందయినా, జక్కన్న మాత్రం ఎలా చేయగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారా? ఆ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వారంతా వీహెచ్ఎఫ్ రంగంలో నిష్ఠాతులు. చిత్ర నిర్మాణం కోసం రాజమౌళి వీరందరినీ ప్రత్యేకంగా లాస్ ఏంజిల్స్ నుంచి రప్పించారు. వాళ్లలో ఎవరూ తెలుగు చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంఘానికి చెందినవారు కాకపోవడంతో బాహుబలి చిత్ర నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి. ఈ చిత్ర పనులన్నింటినీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రాజమౌళి బృందం కృత నిశ్చయంతో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోలు ప్రభాస్, దగ్గుబాటి రానాలతోపాటు అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే.