టాలీవుడ్ బందయినా.. జక్కన్న ఆగడు | TOLLYWOOD SHUTDOWN, BUT BAAHUBALI POWERS ON | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ బందయినా.. జక్కన్న ఆగడు

Oct 17 2014 10:14 AM | Updated on Jul 14 2019 4:05 PM

టాలీవుడ్ బందయినా.. జక్కన్న ఆగడు - Sakshi

టాలీవుడ్ బందయినా.. జక్కన్న ఆగడు

తెలుగు చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంఘం సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చింది. దాంతో తెలుగు చిత్రసీమలో షూటింగులన్నీ రద్దవుతున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంఘం సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చింది. దాంతో తెలుగు చిత్రసీమలో షూటింగులన్నీ రద్దవుతున్నాయి.  అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బాహుబలి చిత్రం పనులు మాత్రం హైదరాబాద్ నగర శివార్లలో శరవేగంగా సాగిపోతున్నాయి. అందరికీ బందయినా, జక్కన్న మాత్రం ఎలా చేయగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారా? ఆ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వారంతా వీహెచ్ఎఫ్ రంగంలో నిష్ఠాతులు.

చిత్ర నిర్మాణం కోసం రాజమౌళి వీరందరినీ ప్రత్యేకంగా లాస్ ఏంజిల్స్ నుంచి రప్పించారు. వాళ్లలో ఎవరూ తెలుగు చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంఘానికి చెందినవారు కాకపోవడంతో బాహుబలి చిత్ర నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి. ఈ చిత్ర పనులన్నింటినీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రాజమౌళి బృందం కృత నిశ్చయంతో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోలు ప్రభాస్, దగ్గుబాటి రానాలతోపాటు అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement