Commitment Movie Trailer: 'కమిట్‌మెంట్' ఇస్తుందా ? లేదా ?.. బోల్డ్ సీన్లతో ట్రైలర్

Tejaswi Madivada Commitment Trailer Released: బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ వివాదానికి గురి కాగా డైరెక్టర్ లక్ష్మీ కాంత్ క్షమాపణలు తెలిపారు.
ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం (ఆగస్టు 3) విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ రంగంలో ఎదగాలన్న కమిట్‌మెంట్ ఇవ్వాలన్న పరిస్థితులు నెలకొన్నట్లు ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. 'సమాజంలో ఒక మగాడు ఎలాగైనా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతది' అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషుల్ల సంగతే మరిచిపోతున్నారు, కాస్త మనుషుల్లా ఆలోచించండి' వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్‌ను పలు బోల్డ్ సీన్లతో కట్ చేసిన అమ్మాయిలు 'కమిట్‌మెంట్' అనే విషయంతో ఎలా నలిగిపోతున్నారనే విషయాన్ని చూపించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించిన 'కమిట్‌మెంట్' ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకు రానుంది.