టాలీవుడ్‌ హీరోకు ఎంఎస్ ధోని గిఫ్ట్.. అదేంటో తెలుసా? | Team India Ex Captain MS Dhoni Sends Gift To Hero Nithiin | Sakshi
Sakshi News home page

Nithiin: టాలీవుడ్‌ హీరోకు ఎంఎస్ ధోని గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Published Wed, Nov 29 2023 1:48 PM | Last Updated on Wed, Nov 29 2023 2:53 PM

Team India Ex Captain MS Dhoni Gift To Tollywood Hero Nithiin - Sakshi

టాలీవుడ్ హీరో నితిన్ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ అంటూ అభిమానులను పలకరించునున్నారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ  చిత్రాన్ని వక్కంత వంశీ దర్శకత్వంలో  తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‍అయితే హీరో నితిన్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

తాజాగా ట్విటర్‌లో ఓ ఫోటోను నితిన్ పంచుకున్నారు. అందులో ఓ టీ షర్ట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ నుంచి ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ టీ షర్ట్‌ను టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని పంపించారంటూ ట్వీట్ చేశారు. కాగా.. నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డీనరీ డిసెంబర్‌ 8న థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement