బ్యాంక్‌కు వచ్చి బీర్, బ్రాందీ అడుగుతారా?.. అదిరిపోయిన ట్రైలర్ | Tamil Star Ajith Kumar Movie Thegimpu Trailer Out Today | Sakshi
Sakshi News home page

Thegimpu Trailer: బుద్ధున్నోడు ఎవడైనా నాతో పెట్టుకుంటారా?.. అదిరిపోయిన తెగింపు ట్రైలర్

Jan 2 2023 9:11 PM | Updated on Jan 2 2023 9:11 PM

Tamil Star Ajith Kumar Movie Thegimpu Trailer Out Today - Sakshi

తమిళ స్టార్ నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'తునివు'. తెలుగులో ఈ చిత్రాన్ని తెగింపు పేరుతో విడుదల చేస్తున్నారు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం తునివు షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ ఏడాది సంక్రాంతికి‌ రిలీజ్ కానుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైంది. 'ప్రజల డబ్బు దోచుకుంటున్నావే.. సిగ్గుగా లేదు' అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ చూస్తే ఈ మూవీ మొత్తం బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. సముద్రంలో ఫైట్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మలయాళ సూపర్‌ స్టార్‌ మంజు వారియర్‌ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్‌ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్‌ రేస్‌కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement