
ఈ సందర్భంగా చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కోసం ఆదివారం సాయంత్రం చెన్నైలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన ముఖ్యమంత్రి నెంజుక్కు నీది చిత్రం బాగుందని ప్రశంసించి కథానాయకుడు ఉదయనిధి
'నెంజుక్కు నీది' సినిమా చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం నెంజుక్కు నీది. హిందీ మూవీ ఆర్టికల్– 15ను తమిళంలో రీమేక్ చేస్తూ జి.స్టూడియోస్, బోనీకపూర్ బేవ్యూ ప్రాజెక్టు, రోమియో పిక్చర్స్ రాహుల్ కలిసి నిర్మించారు. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కోసం ఆదివారం సాయంత్రం చెన్నైలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన ముఖ్యమంత్రి నెంజుక్కు నీది చిత్రం బాగుందని ప్రశంసించి కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్, నిర్మాతలు బోనీ కపూర్, రాహుల్, దర్శకుడు అరుణ్‌రాజా కామరాజ్‌ను అభినందించారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేయనుంది.
చదవండి👇
రాజశేఖర్‌గారి వల్ల ఫేమస్ అయ్యా – డైరెక్టర్ సుకుమార్
హీరో బాలకృష్ణ ఇంటివైపు దూసుకెళ్లిన కారు..