నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం? | Tamil Actress Kasturi Arrest Over Her Controversial Comments On Telugu People? | Sakshi
Sakshi News home page

Kasturi Arrest: నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Nov 7 2024 11:46 AM | Updated on Nov 8 2024 1:52 PM

Tamil Actress Kasturi Arrest ?

4 సెక్షన్ల కింద కేసు నమోదు 

తమిళసినిమా: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసే విషయమై న్యాయ నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నారు. ఇండియా తెలుగు సమ్మేళనం తరఫున కసూ్తరిపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశా­రు. దీంతో పోలీసులు ఆమెపై 192, 196(1ఏ)3 53 ,353(2) సెక్షన్‌ల కింద కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్‌ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

దీంతో నటి కస్తూరి అరెస్ట్‌ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కస్తూరి ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, తన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచినట్లయితే వారికి క్షమాపణ చెబుతున్నానని ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. 

చ‌ద‌వండి: రోజుకో వ్యక్తితో నాకు అక్రమ సంబంధం పెడుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement