మనం కలిస్తే చోలే భాటురే తిందాం.. కేబీసీ కంటెస్టెంట్‌కి తాప్సీ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: మనం కలిస్తే చోలే భాటురే తిందాం.. కేబీసీ కంటెస్టెంట్‌కి తాప్సీ ఆఫర్‌

Published Thu, Oct 21 2021 3:23 PM

Taapsee Pannu Reveals Her Favourite Dish After KBC Contestant Asks About it to Amitabh - Sakshi

టాలీవుడ్‌లో స్టార్స్‌తో సినిమాలు చేసి తన కంటూ గుర్తింపు పొందింది నటి తాప్సీ పన్ను. అనంతరం ‘పింక్‌’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టి అక్కడ కూడా మంచి పేరునే సంపాదించుకుంది ఈ బ్యూటీ. తర్వాత వరుస సినిమాలతో తన ప్రతిభని చాటుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అయితే తాజాగా ఓ అభిమాని ఒకరికి సోషల్‌ మీడియాలో ఆఫర్‌ ఇచ్చింది ఈ బ్యూటీ.

‘కౌన్ బనేగా కరోడ్‌పతి-13’కి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో కంటెస్టెంట్‌గా సాహిల్ అహిర్‌వార్‌ అనే వ్యక్తి వచ్చాడు. షోలో బిగ్‌ బీ అతన్ని ‘మీ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరు?’ అని అడగగా.. తాప్సీ పన్ను అన్ని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె నా క్రష్‌, లవ్‌ అని తెలిపాడు.

‘పింక్‌’, ‘బాద్లా’ వంటి సినిమాల్లో అమితాబ్‌ కలిసి తాప్సీ స్క్రీన్‌ షేరు చేసుకుంది. దీంతో ఆ సాహిర్‌ సైతం ఆమె గురించి కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడిగాడు. ‘ఆమెకి ఇష్టమైన ఫుడ్‌ ఏది?’ అని కంటెస్టెంట్‌ అడగగా.. నాకు తెలియదు అని బిగ్‌ బీ తెలిపాడు. కాగా ఈ వీడియో చూసిన తాప్సీ సోషల్‌ మీడియాలో రెస్పాండ్‌ అయ్యింది. ‘సాహిల్‌.. నాకు చోలే భాటురే అంటే ఎంతో ఇష్టం. ఒక వేళ మనం కలిస్తే అది తిద్దాం. ఏడు కోట్ల ప్రశ్నకు చేరినందుకు అభినందనలు’ అంటూ ఆ వీడియోని షేర్‌ చేసింది తాప్సీ. ఫ్యాన్‌కి ఓ హీరోయిన్‌ ఇలాంటి ఆఫర్‌ ఇవ్వడంతో ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ

Advertisement
Advertisement