ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి: ఎస్వీ కృష్ణారెడ్డి | SV Krishna Reddy Birthday Celebrations Veda Vyas Movie Making Video Launch | Sakshi
Sakshi News home page

ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి: ఎస్వీ కృష్ణారెడ్డి

Jun 3 2026 3:30 AM | Updated on Jun 3 2026 3:30 AM

SV Krishna Reddy Birthday Celebrations Veda Vyas Movie Making Video Launch

జేడీ చక్రవర్తి, ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్, అచ్చిరెడ్డి

‘‘నా కెరీర్‌లో 38 చిత్రాలకు సంగీతం అందించిన దర్శకుడిగా నా పుట్టినరోజున ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌’ వారి నుంచి మెమొంటో అందుకున్నాను... ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. నేను తీసిన ‘వేదవ్యాస్‌’ సినిమాను కూడా సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తెలి పారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వేదవ్యాస్‌’. ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్‌ హీరోగా, కొరియన్‌ నటి జూన్‌ హ్యూంజీ హీరోయిన్‌గా, మంగోలియన్‌ నటుడు షరన్‌ బోల్డ్‌ సెగ్మెంట్‌ విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు.

నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాప రెడ్డి నిర్మించిన ఈ మూవీ పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. జూన్‌ 1న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో ‘వేదవ్యాస్‌’ మూవీ మేకింగ్‌ వీడియోను లాంచ్‌ చేశారు.

అచ్చిరెడ్డి మాట్లాడుతూ–‘‘నాలుగైదు ఏళ్లుగా ‘వేదవ్యాస్‌’ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తూ వచ్చాం’’ అని పేర్కొన్నారు. ‘‘వేదవ్యాస్‌’ ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది’’ అని చె΄్పారు కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఈ వేడుకల్లో నటులు మురళీమోహన్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, అలీ, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, అశోక్‌ కుమార్‌  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement