MAA Elections 2021: Manchu Vishnu Will Announce MAA Elections 2021 Panel List - Sakshi
Sakshi News home page

MAA Elections 2021:మంచు విష్ణు ప్యానల్‌పై సర్వత్రా ఉత్కంఠ

Sep 23 2021 9:10 AM | Updated on Sep 23 2021 11:38 AM

Suspense On MAA Elections 2021 - Sakshi

ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉంటుందని చిత్ర పరిశ్రమతో పాటు, సినీ అభిమానుల్లో కూడా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత కొంత కాలంగా టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహా రావు లాంటి అగ్ర నటులు ఉండడంతో మా ఎలక్షన్స్‌ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్‌ 10న జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు పోటీదారులు. వీరిలో ప్రకాశ్‌రాజ్‌ ఒకడుగు ముందున్నాడు. ఇప్పటికే ‘సినిమా బిడ్డలు’పేరుతో తన ప్యానల్‌ను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. కాగా మంచు విష్ణు కూడా తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించేందుకు రెడీ అయ్యారు.

నేడు(సెప్టెంబర్‌ 23)న మంచు విష్ణు తన ప్యానల్‌ను ప్రకటించబోతున్నాడు. ఆయన ప్యానెల్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు ఉండనున్నారని సమాచారం. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉంటుందని చిత్ర పరిశ్రమతో పాటు, సినీ అభిమానుల్లో కూడా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీ పదవికి జీవిత పోటీ పడతుంది. బండ్ల గణేశ్‌ స్వతంత్ర అభ్యర్థిగా జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement