సుశాంత్‌ కేసు: ఈడీ ఆఫీస్‌కు గౌరవ్‌ ఆర్యా

Sushant Singh Death Case: ED To Interrogate Hotelier Gaurav Arya - Sakshi

ముంబై: ఇప్పటికే ఎన్నెన్నో మలుపులు తిరిగిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కీలక విషయాలు రాబట్టే దిశగా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా నిందితురాలు రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్‌లో బయటపడిన గోవాకు చెందిన గౌరవ్‌ ఆర్యాను విచారించనున్నారు. సుశాంత్‌ మృతి కేసుతోపాటు మనీ లాండరింగ్‌, డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి గౌరవ్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఈడీ ఆఫీసుకు గౌరవ్‌ ఆర్య ఆదివారం చేరుకున్నారు. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ ఉదయం 11 గంటలకు ఆర్యాని విచారించనున్నారు. 

ఇక ముంబైకి బయల్దేరేముందు ఆర్యా మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్‌ సింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుశాంత్‌తో ఎటువంటి పరియచం లేదని, ఎప్పుడూ అతన్ని చూడలేదని చెప్పాడు. రియాను 2017లో కలుసుకున్నాని వెల్లడించాడు. కాగా, గోవాలోని తమరైండ్‌ హొటల్‌ అండ్‌ కేఫ్‌ కొటింగాని అతను నిర్వహిస్తున్నాడు. ఈడీ విచారణ అనంతరం, సీబీఐ, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆర్యాను విచారించనున్నారు. ఇక రియా చక్రవర్తి కూడా సీబీఐ అధికారుల ఎదుట సోమవారం ఉదయం హాజరయ్యారు.
(చదవండి: రియాకు మంచు ల‌క్ష్మి, తాప్సీ మ‌ద్ద‌తు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top