అరుదైన నటుల్లో సూర్య ఒకరు : కన్నడ స్టార్‌ సుదీప్‌

Surya should Have Been awarded The Oscar: Actor Sudeep Praised - Sakshi

చెన్నై: కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్‌ నటుడు సూర్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూరరై పోట్రు చిత్రం, కథానాయకుడిగా చేసిన సూర్య గురించి మాట్లాడారు. ‘నేను ఇటీవల సూరరై పోట్రు చిత్రం చూశాను. అందులో నటనకు సూర్యకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి. అందుకు ఆయన అర్హుడు. నేను కలిసిన అరుదైన నటుల్లో సూర్య ఒకరు. చాలా నిజాయితీ గల వ్యక్తి’ అని అన్నారు. కాగా నటుడు సూర్య నటించి నిర్మించిన చిత్రం సూరరై పోట్రు ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top