ఆస్కార్‌ నుంచి సూర్య సినిమా అవుట్‌.. నిరాశలో ఫ్యాన్స్‌

Suriya Soorarai Pottru Out Of Oscars Race - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే నీ హద్దురా). సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల ఆస్కార్ అవార్డ్ పోటీలో నామినేషన్ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌గా.. అందులో మ‌న దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నుంచి వైదొలిగింది. అకాడమీ స్క్రీనింగ్‌కు ఎంపిక అయిన సూరారై పోట్రు ఆ తర్వాతి రౌండ్స్‌కు నామినేట్ అవ్వలేకపోయింది. దీంతో మార్చి 15న ఆస్కార్‌ నుంచి అధికారికంగా తప్పకుంది. ఇదిలా ఉండగా 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 2021 ఏప్రిల్ 25న జరగనుంది.

కాగా ఉత్తమ చిత్రం విభాగంలో భారత్‌ నుంచి ఎంపికైన చిత్రాల్లో సూరారై పోట్రు ఒక్కటే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజ‌న‌ల్ స్కోర్‌తోపాటు ఇతర పలు విభాగాల్లో ఎంపికైంది. తమిళ సినిమాకు ఇంతటి అరుదైన ఘనత లభించడంతో ఆనందంలో మునిగిపోయిన అభిమానులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో వచ్చిన విషయం తెలిసిందే.

త‌క్కువ ధ‌ర‌కే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన‌ ఏయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేశారు. నవంబర్‌ 12న  విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. 

చదవండి: 
హీరో సూర్య కొత్త ప్రయాణం

బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్‌ హంగామా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top