పడమ్‌ బిగిన్స్‌ | Suriya retro look for Karthik Subbaraj next stuns fans | Sakshi
Sakshi News home page

పడమ్‌ బిగిన్స్‌

Published Tue, Jun 4 2024 12:02 AM | Last Updated on Tue, Jun 4 2024 12:02 AM

Suriya retro look for Karthik Subbaraj next stuns fans

కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ఆరంభమైంది.

సూర్య కెరీర్‌లోని ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ, ‘పడమ్‌ బిగిన్స్‌’ (సినిమా ఆరంభమైంది) అంటూ చిన్న వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు కార్తీక్‌ సుబ్బరాజ్‌. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సూర్య లుక్‌ని బట్టి ఇది పీరియాడికల్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement