పవర్‌ఫుల్‌ లాయర్‌గా సూర్య

Suriya Next With Director Gnanavel Titled Jai Bhim - Sakshi

సూర్య హీరోగా నటిస్తున్న 39వ చిత్రానికి ‘జై భీమ్‌’ అనే టైటిల్‌ని ప్రకటించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్యా శివకుమార్‌ నిర్మిస్తున్నారు. పోస్టర్లో సూర్య లాయర్‌గా కనిపిస్తున్నారు. భూముల కోసం పోరాడే పేదలకు అండగా నిలబడే పవర్‌ఫుల్‌ లాయర్‌గా ఆయన కనిపించనున్నారు. రజీషా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాశ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top