సురేశ్ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ! | Suresh Kondeti And Annapoornamma In Abhimani Movie | Sakshi
Sakshi News home page

సురేశ్ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ!

Feb 5 2024 6:25 PM | Updated on Feb 5 2024 6:25 PM

Suresh Kondeti And Annapoornamma In Abhimani Movie - Sakshi

తెలుగు సినిమాల్లో అమ్మ, అమ్మమ్మ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అన్నపూర్ణమ్మ. సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు ఈమె అమ్మగా నటించి మెప్పించింది. తమిళ సినిమాల్లోనూ అన్నపూర్ణమ్మకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఏదో ఒక మూవీలో కనిపిస్తూనే ఉంటుంది. 

(ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?)

దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. ఇప్పుడు ఈమె.. నటుడిగా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తోంది. సురేష్ కొండేటి ప్రస్తుతం 'అభిమాని' అనే వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులోనే వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్‌లో వస్తున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు.

(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్‌ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement