Surekha Vani Daughter Supritha All Set To Enter Into Movies With Lakshmi Manchu Movie - Sakshi
Sakshi News home page

Supritha: మంచు లక్ష్మి సినిమాలో సుప్రిత.. పోస్టర్‌ రిలీజ్‌

May 7 2022 4:25 PM | Updated on May 7 2022 5:13 PM

Surekha Vani Daughter Supritha All Set To Enter Into Silver Screen - Sakshi

టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ మరింత ఫాలోయింగ్‌ పెంచుకుంటున్న సుప్రిత  త్వరలోనే వెండితెరపై కనిపించనుంది. 

ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్,ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులర్‌ అయిన సుప్రిత ఈ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న మహిళా లోకం  అనే సినిమాలో నటించనుంది. మంచు లక్ష్మీ ఇందులో మెయిన్‌ లీడ్‌లో నటిస్తుంది. శుక్రవారం ఈ సినిమా పోస్టర్‌ని రిలీజ్‌ చేసిన మంచు లక్ష్మీ మూవీ టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. కాగా ఈ సినిమాలో సుప్రీతతో పాటు హరితేజ, హేమ, శ్రద్దాదాస్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement