ఆదియోగి సేవలో రజనీకాంత్!

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి కర్ణాటక, చిక్కబల్లాపుర జిల్లాలోని ఆదియోగి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు ఈషా యోగ మందిరం తరపున ఈఏడాది జనవరి 15 కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపుర జిల్లాలోని నందిమలై (కొండ) పరీవాహక ప్రాంతంలో 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కోయంబత్తూరులోని శివుని శిలా విగ్రహం మాదిరిగానే చిక్కబల్లాపురలో ఆదియోగి శిలా విగ్రహం ఉండడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తులు శనివారం నుంచే శివ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నటుడు రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి ఆదియోగిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ యోగేశ్వర లింగానికి విశేష పూజలు నిర్వహించారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వార్తలు