ఐటం సాంగ్‌లో సన్నీలియోన్‌.. | Sunny Leone Special Song In Prabhu Deva's Petta Rap Movie | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా మూవీలో సన్నీలియోన్‌ స్పెషల్‌ సాంగ్‌

Jun 14 2024 10:26 AM | Updated on Jun 14 2024 10:42 AM

Sunny Leone Special Song In Prabhu Deva's Petta Rap Movie

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా ముద్ర వేసుకున్న నృత్యదర్శకుడు ప్రభుదేవా. ఈయన నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడిగా హిట్‌ చిత్రాలను చేసిన ఈయన ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడుతున్నారు. అలా ప్రభుదేవా ఇటీవల నటించిన చిత్రం భగీర. ఇందులో రకరకాల గెటప్‌ల్లో విలన్‌గా అదరగొట్టారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వాటితో పాటు విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న గోట్‌ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు.

ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో జాలియో జింఖానా ఒకటి. శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న మరో చిత్రం పేటరాప్‌. ఎస్‌జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఇందులో వేదిక హీరోయిన్‌గా నటిస్తున్నా రు.

బ్లూ హిల్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి సన్నీ లియోన్‌ ఒక ఐటమ్‌ సాంగ్‌లో నటిస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈమె చిన్నగ్యాప్‌ తరువాత మళ్లీ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారన్నమాట. వివేక్‌ ప్రసన్న, భగవతి పెరుమాళ్‌, రమేశ్‌ తిలక్‌, మైమ్‌గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

 

 

చదవండి: గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement