Sunny Leone On Her Adult Film Career: నా నుంచి ఏం కావాలో వారు పొందారు అంటూ సన్నీలియోన్‌ కామెంట్స్‌

Sunny Leone Opens Up Her Adult Film Career - Sakshi

బాలీవుడ్‌లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్‌ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. దీంతో 2012 నుంచి అలాంటి చిత్రాలు చేయడం మానేసి హిందీ చిత్రాలు, ఐటమ్‌ సాంగ్స్‌లో నటిస్తూ మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్‌ బ్యూటీ.. ఫోటోలు వైరల్‌)

వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ (2011-12) ఐదవ సీజన్‌లో పాల్గొన్నప్పుడు సన్నీ లియోన్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అప్పటికే ఆమె అశ్లీల చిత్రాల్లో నటిస్తూ ఉండటంతో ఆమెపై ఇండియాలో చాలా వ్యతిరేకత ఉండేది. దీంతో భారత్‌లో అడుగుపెడితే చంపేస్తామని ఆమెకు పలువురు  మెయిల్స్‌ కూడా చేశారు. కానీ షో నిర్వాహుకులు ఆమెను బలవంతంగా ఒప్పించి. సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పడంతో ఇండియాలో అడుగుపెట్టింది. కానీ ఆమెపై బెదిరింపులు ఎక్కువడంతో తట్టుకోలేక బిగ్‌బాస్‌షోను ప్రజెంట్‌ చేసే సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తి ఒకరు అప్పట్లో జాబ్‌కు రిజైన్‌ చేసేశారు. కానీ సన్నీకి ఎలాంటి ఆపద జరగలేదు. షో అనంతరం ఆమె లండన్‌ వెళ్లిపోయింది.  

ఆ షో సన్నీలియోన్‌  కెరీర్‌ను మార్చేసింది. షోలో ఆమెను చూసిన భారత్‌ ప్రజలు ఎంతగానో ఆదరించారని సన్నీ చెప్పుకొచ్చింది. తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించడం ఆమె మానేసింది. 2012 ఎరోటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2లో సన్నీలియోన్‌  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ,బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో భాగమైంది.

(ఇదీ చదవండి: లైంగిక వేధింపులు.. ఎలా బయటపడతానోనని భయమేసింది: నటి)

ఇటీవలి ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. తాను అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ కంపెనీలతో పనిచేశానని, ఉదాహారణగా వాటిని హిందీ చిత్ర పరిశ్రమలోని రెండు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలైన కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్‌తో పోల్చింది. ఈ రెండూ తనను బాలీవుడ్‌లో ఎంతగానో ఆదరించాయని సన్నీ తెలిపింది.

'ఒక శృంగార తారగా ఎంతో కష్టపడి పనిచేశాను. నన్ను నియమించుకున్న కంపెనీలు వారు కోరుకున్నవి నా నుంచి పొందారు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. నాకు అప్పట్లోనే కోట్లాదిమంది అభిమానులు ఉండేవారు. వారి కోసం అయినా శృంగార సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో ఆర్థికంగా కూడా చెప్పుకోతగిన స్థాయిలో లేను. కానీ ఇండియాలో బిగ్‌బాస్‌ సీజన్‌లో అడుగుపెట్టిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఇక్కడ నాకు అడల్ట్‌ సీన్లు చేస్తారా..? అని ఎవరూ అడగలేదు. అన్నీ మంచి అవకాశాలే వచ్చాయి.

దాంతో వాటికి గుడ్‌బై చెప్పేశాను. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. పలు సినిమాల ద్వారా మంచి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. కానీ బాలీవుడ్‌లో  స్టార్ హీరోలు నాతో నటించేందుకు ముందుకు రాలేదు. తొలిసారి  షారుఖ్‌ సరసన ఐటెం సాంగ్‌లో అవకాశం దక్కింది.' అని చెప్పుకొచ్చింది.

ఇండియన్  సినిమాను రిప్రజెంట్‌ చేసిన సన్నీ
ఫ్రాన్స్లో జరిగిన 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సన్నీ లియోన్ మెరిసింది . అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో రాహుల్‌ భట్, సన్నీ లియోన్  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్‌. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్‌ ఒవేషన్  చిత్ర యూనిట్‌కు ఇచ్చారు. ఇక కాన్స్ రెడ్‌ కార్పెట్‌పై సన్నీ లియోన్  నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్  సినిమాను రిప్రజెంట్‌ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ .  ఈ ఏడాది చివర్లో ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top