‘డియర్ ఉమ’ గా రాబోతున్న సుమయ రెడ్డి | Sumaya Reddy Dear Uma Movie Getting Ready For Release | Sakshi
Sakshi News home page

‘డియర్ ఉమ’ గా రాబోతున్న తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి

Jan 16 2024 3:12 PM | Updated on Jan 16 2024 3:12 PM

Sumaya Reddy Dear Uma Movie Getting Ready For Release - Sakshi

తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డియర్‌ ఉమ’.  దియ మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  రాజేష్ మహాదేవ్  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్పై సుమయ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా నిర్మించారు. టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలుస్తుందని మేకర్లు చెబుతున్నారు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు త్వరలోనే థియేటర్లోకి రానుందని దర్శక నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement