
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్.. ఇంటికొచ్చేశాడు. మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు సినీ ప్రముఖులు అతడి ఇంటికి వస్తున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దర్శకుడు సుకుమార్ మాత్రం బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)
ఇంటికొచ్చి బన్నీని కలిసిన వాళ్లలో చిరంజీవి భార్య సురేఖతో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, దిల్ రాజు ఉన్నారు. అలానే హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, శ్రీకాంత్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు, యంగ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, వశిష్ఠ తదితరులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రీసెంట్‌గా 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ మాత్రం బన్నీని ఇంట్లో కలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కూర్చుని వీళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో తొలుత బన్నీని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)
#Sukumar sir " We Love You " ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024