అందుకే మల్టీజానర్‌ మూవీగా చేశాం: సుకు పూర్వజ్‌  | Suku Purvaj Matarani Mounamidi Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

Suku Purvaj: 'మా సినిమాలో ఆ క్యారెక్టర్స్‌కు సంభాషణలు  ఉండవు'

Aug 17 2022 10:39 AM | Updated on Aug 17 2022 10:42 AM

Suku Purvaj Matarani Mounamidi Movie Gets Release Date - Sakshi

‘‘ఒక సినిమాలో ఫిక్షన్, థ్రిల్లర్, హారర్‌.. ఇలా ఏదో ఒక ఎలిమెంట్‌ ఉంటుంది. కానీ, మా ‘మాటరాని మౌనమిది’ చిత్రంలో అలాంటి అంశాలను కలిపి మల్టీ జానర్‌ మూవీగా చేశాం. ఇందులో రెండు ప్రేమకథలు, నవ్వించే అంశాలు ఉంటాయి’’ అని సుకు పూర్వజ్‌ అన్నారు. మహేష్‌ దత్త, శ్రీహరి ఉదయగిరి హీరోలుగా, సోనీ శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మాట రాని మౌనమిది’.

రుద్ర పిక్చర్స్, పిసిర్‌ గ్రూప్‌ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుకు పూర్వజ్‌  మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రెండు మేజర్‌ క్యారెక్టర్స్‌కు సంభాషణలు ఉండవు. అనుకోని పరిస్థితి ఎదురైతే వాళ్లు ఆ సందర్భాన్ని ఇతరులకు ఎలా చెప్పగలరు? అనేది సినిమాలోఆసక్తికరంగా ఉంటుంది. ‘లవ్‌ స్టోరీ, థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాని ఇప్పటికే కొన్ని ప్రివ్యూ షోస్‌ వేశాం. చూసినవాళ్లంతా చాలా బాగుందనడంతో సినిమాపై విజయంపై మంచి నమ్మకం ఏర్పడింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement