అఫీషియల్: ఓటీటీకి 'రైటర్‌ పద్మభూషణ్‌'.. స్ట్రీమింగ్ ఆ రోజే నుంచే

Suhas Movie Writer Padmabhushan Ott Release On March 17th - Sakshi

కలర్‌ ఫోటో ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టీనా శిల్పరాజ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. 

అసలు కథేంటంటే..
పద్మ భూషణ్‌ అలియాస్‌ రైటర్‌ పద్మభూషణ్(సుహాస్‌) విజయవాడలో లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్‌ కావాలని కలలు కంటాడు. అతని ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంటారు తండ్రి మధుసూధన్‌రావు(అశిష్‌ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి).  పద్మభూషన్‌ కష్టపడి ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. పేరెంట్స్‌కి తెలియకుండా అప్పుచేసి మరీ ఆ పుస్తకాన్ని పబ్లీష్‌ చేయిస్తాడు. కానీ ఆ పుస్తకాన్ని ఎవరూ కొనుగోలు చేయరు. ఉచితంగా ఇచ్చినా చదవరు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతాడు.  

కట్‌ చేస్తే.. పద్మ భూషన్‌ పేరుతో మార్కెట్‌లోకి ఓ పుస్తకం వస్తుంది. అది బాగా సేల్‌ అవుతుంది. అంతేకాదు అతని పేరు మీద బ్లాగ్‌ కూడా రన్‌ అవుతుంది. దీంతో పద్మభూషన్‌ సెలెబ్రెటీ అవుతాడు. మేనల్లుడు గొప్ప రైటర్‌ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్‌)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్‌ మామ లోకేంద్ర కుమార్‌(గోపరాజు రమణ). ఇష్టపడిన మరదలితో పెళ్లి అవుతుందన్న సమయంలో షాకింగ్‌ ట్విస్ట్‌ ఎదురవుతుంది. అదేంటి? రైటర్‌ పద్మభూషణ్‌ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? ఎందుకు రాస్తున్నారు? మరదలు సారికాతో పద్మభూషణ్‌ పెళ్లి జరిగిందా లేదా? గొప్ప రైటర్‌ కావాలన్న పద్మ భూషణ్‌ కల నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. థియేటర్లలో మిస్సయినావారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top