తమిళ మూవీలో సుహాస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ | Suhas First Look Mandaadi Movie | Sakshi
Sakshi News home page

Suhas: స్పోర్ట్స్ డ్రామాలో సుహాస్.. తమిళంలో అరంగేట్రం

May 5 2025 6:37 PM | Updated on May 5 2025 7:30 PM

Suhas First Look Mandaadi Movie

కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలతో ఆకట్టుకున్న హీరో సుహాస్.. ఇప్పుడు తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టాడు. సూరి హీరోగా నటిస్తున్న ఓ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్) 

సూరి, మహిమ నంబియార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మండాడీ. ఇందులో తెలుగు నటుడు సుహాస్ కీలక పాత్ర చేస్తున్నాడు. లుంగీ, నెరిసిన జుట్టుతో సునామీ రైడర్స్ ‍అనే జెర్సీతో కనిపించాడు. ప్రతినాయక పాత్రలా అనిపిస్తోంది. మతిమారన్ దర్శకుడు కాగా త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 

Advertisement
 
Advertisement
Advertisement