Trolls On Suhana Khan: ఏం తల్లీ, ఎందుకంత బిల్డప్‌ ఇస్తున్నావు? షారుక్ కూతురిపై ట్రోలింగ్‌

Suhana Khan Getting Trolled for Her Party Dress - Sakshi

సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లుంటారు, విమర్శించే వాళ్లూ ఉంటారు. వారు ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, ఎలాంటి దుస్తువులు వేసుకున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయితే ఈ నెగెటివిటీ వారి ఒక్కరిపైనే కాకుండా ఆ కుటుంబంపైన కూడా చూపిస్తుంటారు. ఈ క్రమంలో తారల పిల్లలు కూడా కొన్నిసార్లు ట్రోల్స్‌ బారిన పడుతుంటారు. తాజాగా స్టార్‌ కిడ్‌ సుహానా ఖాన్‌ను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

షారుక్‌ ఖాన్‌ కూతురు సుహానా 'ద ఆర్చీస్‌' అనే సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ అయిపోవడంతో అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి ఆమె రెడ్‌ కలర్‌ టైట్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు చూసిన నెటిజన్లు సుహానాపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'మలైకా అరోరాలా నడుస్తూ ఎందుకంత బిల్డప్‌ ఇస్తున్నావు?', 'అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. డిస్‌లైక్‌ బటన్‌ ఉంటే బాగుండు..', 'ఏం తల్లీ.. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని సినిమాలో ఎంట్రీ ఇస్తున్నావా?', ' ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ కాకముందే ఆ రేంజ్‌లో రెడీ అవుతున్నావా? నీకవసరమా?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై షారుక్‌ ఫ్యాన్స్‌ మండిపడుతూ.. సుహానాపై ఎందుకంత విషాన్ని చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: నటి మాళవికకు నయనతార కౌంటర్‌
మోడల్‌తో డిన్నర్‌ డేట్‌కు టైటానిక్‌ స్టార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top