Leonardo DiCaprio Spotted with Model Victoria Lamas, Dating Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Leonardo DiCaprio: మోడల్‌తో హాలీవుడ్‌ స్టార్‌ డిన్నర్‌ డేట్‌, అసలు కథేంటంటే?

Dec 22 2022 2:51 PM | Updated on Dec 22 2022 3:35 PM

Leonardo DiCaprio Spotted with Model Victoria Lamas - Sakshi

డిన్నర్‌ పూర్తవగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వారేమైనా ప్రేమలో ఉన్నారని కొందరు భ్రమపడుతున్నారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే ఇలా కలిసి డిన్నర్‌ను

టైటానిక్‌ హీరో లియొనార్డో డికాప్రియో ఓ మోడల్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు. తనకంటే 25 ఏళ్లు చిన్నదైన మోడల్‌ విక్టోరియా లామస్‌తో కలిసి మంగళవారం రాత్రి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక డిన్నర్‌ పూర్తవగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వారేమైనా ప్రేమలో ఉన్నారని కొందరు భ్రమపడుతున్నారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే ఇలా కలిసి డిన్నర్‌ను ఆస్వాదించారట.

కాగా నటుడు లారెంజో లామస్‌ కూతురే విక్టోరియా లామస్‌. ఎక్కువగా మోడలింగ్‌పైనే ఫోకస్‌ పెట్టిన విక్టోరియా ద లాస్ట్‌ థింగ్‌ ద ఎర్త్‌ సేడ్‌, ఎ విర్చుయస్‌ రోల్‌, టు నైనర్‌ వంటి సినిమాల్లోనూ నటించింది. లియొనార్డో డికాప్రియో విషయానికి వస్తే ఇటీవలే అతడు తన ప్రేయసి కెమిలా మోరోన్‌కు బ్రేకప్‌ చెప్పాడు. ప్రస్తుతం అతడు మోడల్‌ గిగి హాడిడ్‌తో లవ్‌లో ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ పార్టీలో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. గిగి విషయానికి వస్తే ఆమె ప్రియుడితో విడిపోయి ఒక్కగానొక్క బిడ్డతో కలిసి ఉంటోంది.

చదవండి: తనపై జరిగిన దాడిపై తొలిసారి స్పందించిన హీరో
తొలిసారి కూతురిని చూసి రేవంత్‌ ఎమోషనల్‌

Advertisement
 
Advertisement
Advertisement