Nayanthara Strong Counter To Actress Malavika Mohanan Criticism, Deets Inside - Sakshi
Sakshi News home page

Nayanthara: నటికి నయన్ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Dec 22 2022 3:58 PM | Updated on Dec 24 2022 2:07 PM

Nayanthara Strong Counter To Actress Malavika Mohanan about On Comments - Sakshi

నయనతార సౌత్ ఇండియా చిత్రసీమలో స్టార్‌ హీరోయిన్. తాజాగా కనెక్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గతంలో ఆమె లుక్స్‌పై  కామెంట్‌ చేసిన మరో నటికి కౌంటర్‌ విసిరారు నయనతార. దర్శకుడు చెప్పిన విధంగానే తాను అలా చేశానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కనెక్ట్‌ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె గతంలో ఓ హీరోయిన్‌ చేసిన విమర్శలకు తాజాగా  కౌంటర్‌ ఇచ్చారు.

నయనతార మాట్లాడుతూ.. 'నేను సినిమాకు అనుగుణంగా ఏం చెబితే అదే చేస్తా. డ్రెస్సింగ్‌, మేకప్‌, వాళ్లు చెప్పిన విధంగానే అనుసరిస్తా. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ చూశా. అందులో ఓ హీరోయిన్‌ నా మేకప్‌ గురించి కామెంట్స్‌ చేసింది. ఆమె పేరు ఇప్పుడు చెప్పాలని లేదు. ఆస్పత్రి సీన్‌లో నేను మేకప్‌, లిప్‌స్టిక్‌ చక్కగా వేసుకోవడాన్ని ఆమె తప్పు పట్టింది. అయితే నేను చెప్పేది ఒక్కటే సినిమాల విషయంలో చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఇందులో కమర్షియల్‌, రియలిస్టిక్ చిత్రాలు ఉంటాయి. రియలిస్టిక్‌ చిత్రంలో లుక్స్‌ పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్‌ సినిమాలో దర్శకుడు హీరోయిన్స్‌ను ఇలాగే స్టైలిష్‌గా చూపిస్తారు' అని అ‍న్నారు. 

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఇదంతా నటి మాళవికా మోహన్‌ గురించేనని కామెంట్స్‌ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సూపర్‌స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఓ నటి ఆస్పత్రి సన్నివేశంలోనూ ఫుల్‌ మేకప్‌ వేసుకుని నటించింది. లిప్‌స్టిక్‌, హెయిర్‌స్టైల్‌ చక్కగా అలంకరించుకుంది. ఆ సీన్స్‌ చూసి నేను షాక్‌ అయ్యా. ఎంత కమర్షియల్‌ సినిమా అయితే మాత్రం కాస్త వాస్తవికత ఉండాలి కదా అనిపించింది' కామెంట్స్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement