రెండో సినిమా షురూ  | Sudigali Sudheer Second Movie Launch | Sakshi
Sakshi News home page

రెండో సినిమా షురూ 

Aug 31 2020 6:19 AM | Updated on Aug 31 2020 6:19 AM

Sudigali Sudheer Second Movie Launch - Sakshi

‘జబర ్దస్త్‌’ ఫేమ్‌ ‘సుడిగాలి’ సుధీర్‌ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కనున్న రెండో చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సాంబశివ ఆర్ట్‌ క్రియేష¯Œ ్స బ్యానర్‌లో అంజన్‌ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సప్తగిరిగారు ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. సెప్టెంబర్‌ మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారం¿ý మవుతుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్, కెమెరా: రాజ్‌ తోట.

Advertisement
 
Advertisement
Advertisement