
మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? అంటూ రాయడానికి వీల్లేని బూతుపదాలతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియోని స్వయంగా ఆయనే ఎక్స్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
వీడియోలో ఏముంది?
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 శ్రీకాంత్ భరత్.. గాంధీజీని దూషిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా శ్రీకాంత్ భరత్ మరో వీడియోని షేర్ చేశాడు. అందులో గాంధీజీ స్త్రీలోలుడని, ఏంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు.
‘నమస్కారం. నేను శ్రీకాంత్ భరత్. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి. అయినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ అక్టోబర్ 2న ఓ పోస్టు పెడితే.. చాలా బూతులు తిట్టారు. నేను కామెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు ఏం తెలుసురా? అంటూ శ్రీకాంత్ భరత్ రెచ్చిపోయారు. గాంధీజీ జాతిపిత అయితే తాను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటూ’ ధైర్యం ఉంటే ఈ వీడియో చూడండి.. ఇది నిజం’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై గాంధీయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు వీడు ఇంత వాగుతున్నా కూడా పోలీస్ లు ఏం చేస్తున్నారు?? ఫాదర్ ఆఫ్ నేషన్ నీ ఇలా ఎవరైనా ఎలా పడితే అలా మాట్లాడొచ్చా సార్ ’ అంటూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘నువ్వు మానసిక సన్యాసి లా ఉన్నావ్. చరిత్ర అసలు తెలియదు. విగడ్ ఆస్పత్రిలో చూపించుకో’ అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. మరికొంత మంది శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.

గతంలోనూ..
నటుడు శ్రీకాంత్ భరత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సినీ క్రిటిక్స్‌ని బూతులు తిడుతూ విడియో పెట్టి.. తర్వాత క్షమాపణలు చెప్పాడు. కొన్నాళ్లకు మరోసారి రివ్యూవర్స్పై రాయడానికి వీల్లేని పదాలతో రెచ్చిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నటనతో కంటే ఇలాంటి వివాదస్పద పోస్టులతోనే శ్రీకాంత్ భరత్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.
Dare to WATCH?!?!?!
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025