శ్రీదేవి సోడా సెంటర్‌

Sridevi Soda Center Motion Poster Release - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘భలే మంచి రోజు’లో హీరోగా నటించిన సుధీర్‌ బాబు ఈ ‘శ్రీదేవి సోడా సెంటర్‌’లోనూ హీరోగా నటించనున్నారు. శుక్రవారం విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో సుధీర్‌ బాబు సోడా పట్టుకొని ఉన్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌లో మొదలుపెడుతున్నట్లు విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: షామ్‌దత్‌ శైనుద్దీన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top