కార్తీ సరసన తెలుగమ్మాయికి హీరోయిన్‌గా ఛాన్స్‌ | Actress Sri Divya Get Movie Chance With Karthi, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

హీరో కార్తీతో రొమాన్స్‌ చేయనున్న తెలుగమ్మాయి

Published Sat, Feb 3 2024 7:14 AM

Sri Divya Get movie chance With Karthi  - Sakshi

నటి శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్‌ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు జంటగా వరుత్తపడాద వాలిబర్‌ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటి శ్రీదివ్య. తెలుగులోనూ నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వరించాయి. అలా ఈమె ఇక్కడ నటించిన చిత్రాలన్నీ హిట్‌ అయ్యాయి కూడా. అలాంటిది ఆ మధ్య అవకాశాలు ముఖం చాటేశాయి.

చాలా గ్యాప్‌ తరువాత విక్రమ్‌ప్రభు సరసన నటించిన రైడ్‌ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అలా మళ్లీ వార్తల్లోకి వచ్చిన శ్రీదివ్య అవకాశాలపై దృష్టిపెట్టింది. మొత్తం మీద తాజాగా లక్కీచాన్స్‌ ఈ అమ్మడిని వరించింది. కార్తీతో రొమాన్స్‌ చేయబోతోంది. 96 చిత్రం ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కథానాయకి ఎవరన్నది ఇప్పుటి వరకూ ప్రకటించలేదు. తాజాగా గురువారం శ్రీదివ్య పేరును అధికారికంగా యూనిట్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ అమ్మడు ఇంతకుముందు కార్తీ సరసన కాశ్మోరా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో మరోసారి ఈ జంట తెరపై మెరవనున్నారన్నమాట. మొత్తం మీద శ్రీదివ్య మళ్లీ దారిలో పడిందన్నమాట.

Advertisement
Advertisement