యాంకర్‌ను పెళ్లి చేసుకున్న 'శ్రీకారం' సినిమా డైరెక్టర్‌ | Sreekaram Movie Director Kishore Marriage With Anchor Krishna Chaitanya, Wedding Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Director Kishore Marriage: యాంకర్‌ను పెళ్లి చేసుకున్న 'శ్రీకారం' సినిమా డైరెక్టర్‌

Published Fri, Mar 1 2024 8:14 AM

Sreekaram Movie Director Kishore Marriage With Anchor Krishna Chaitanya - Sakshi

'శ్రీకారం' సినిమా దర్శకుడు కిశోర్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు.  తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో ఆయన వివాహం జరిగింది.  శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిశోర్‌ తెలుగులో 'లవ్‌.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి' వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా తనకు మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. నేడు మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో యాంకర్ కృష్ణ చైతన్యను కిశోర్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు.  

యాంకర్ కేసీగా ఆమె అందరికీ సుపరిచితమైనదే.. కృష్ణ చైతన్య కొల్ల గతంలో ఆర్జేగా కూడా పనిచేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాటు సినిమా కార్యక్రమాలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది.

కిశోర్‌-  కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ వారి వివాహానికి సంబంధించిన ఫోటోలో ఇంకా బయటకు రాలేదు కానీ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement