Sonu Sood: శివశంకర్‌ మాస్టర్‌కు సోనూసూద్‌ సాయం!

Sonu Sood Help To Shiva Shankar Master - Sakshi

Sonu Sood Helps To Choreographer Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ కారణంగా  ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న రియల్‌ హీరో సోనూసూద్‌.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.

శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్‌ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top