ఎఫ్‌ 3లో ఫిక్స్‌?

Sonal Chauhan to join the cast of F3 - Sakshi

‘రెయిన్‌బో, లెజెండ్, పండగ చేస్కో, షేర్, డిక్టేటర్, రూలర్‌’ వంటి చిత్రాలతో కథానాయికగా నటించారు సోనాల్‌ చౌహాన్‌ . తాజాగా ‘ఎఫ్‌ 3’లో నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌  నటించిన ‘ఎఫ్‌ 2’ మంచి హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ‘ఎఫ్‌ 2’ కాంబినేషన్‌ లోనే ‘ఎఫ్‌ 3’ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో మూడో హీరోయిన్‌ కూడా ఉండే అవకాశం ఉందని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ పాత్రకు సోనాల్‌ చౌహాన్‌ ని ఫిక్స్‌ చేశారని సమాచారం. ‘ఎఫ్‌ 2’లానే సీక్వెల్‌ని కూడా మంచి నవ్వుల ప్రయాణంలా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top