Son Of India Release Date Telugu: Mohan Babu Son Of India Release In Theaters On 18th February - Sakshi
Sakshi News home page

Son Of India: మోహన్‌బాబు 'సన్‌ ఆఫ్‌ ఇండియా' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Feb 2 2022 10:19 AM | Updated on Feb 2 2022 10:57 AM

Son Of India Grand Release in Theaters on 18th February - Sakshi

తాజాగా మోహన్‌ బాబు హీరోగా నటించిన ‘సన్‌  ఆఫ్‌ ఇండియా’సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 18న విడుదల..

సినిమాలన్నీ వరుసగా రిలీజ్‌ డేట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఫిబ్రవరి 25న, 'రాధేశ్యామ్‌' మార్చి 11న, 'ఆర్‌ఆర్‌ఆర్‌' మార్చి 25న, 'ఆచార్య' ఏప్రిల్‌ 29న, 'ఎఫ్‌ 3' ఏప్రిల్‌ 28న, 'సర్కారువారి పాట' మే 12న, 'భీమ్లా నాయక్‌' ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్‌ 1న రిలీజవుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా మోహన్‌ బాబు హీరోగా నటించిన ‘సన్‌  ఆఫ్‌ ఇండియా’ సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది.

ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేశభక్తి ఇతడి రక్తంలో ఉందని పేర్కొంటూ మోహన్‌బాబు రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.  డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు నిర్మించాయి. ఇళయరాజా సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement