Sogasu Chooda Tarama Movie First Glimpse Released - Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘సొగసు చూడ తరమా’ మూవీ ఫస్ట్‌ గ్లిమ్ప్స్‌

Jul 13 2021 2:49 PM | Updated on Jul 13 2021 4:11 PM

Sogasu Chuda Tarama Movie First Glimpse Teaser Release - Sakshi

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘సొగసు చూడ తరమా’. తల్లాడ సాయి కృష్ణ, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ గ్లిమ్ప్స్‌ టీజర్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. మంగళవారం(జూలై 13) హీరోయిన్ నక్షత్ర బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌లో అరకు అందాలలో హీరోయిన్ ఉన్న సన్నివేశాలు, మంచి నేపధ్యం బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతంతో ఈ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ అన్నారు. 

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. ‘నేను చేసిన రెండవ సినిమా ఇది, అరకులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథగా మా సినిమా రూపొందుతుంది. ‘సొగసు చూడ తరమా’లో నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్‌ గ్లిమ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తల్లాడ సాయి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పవన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement