వినాయక చవితికి కాదు దీపావళికి ‘ప్రిన్స్‌’ వస్తున్నాడు | Sivakarthikeyan Prince Movie Releasing Worldwide This Diwali | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: వినాయక చవితికి కాదు దీపావళికి ‘ప్రిన్స్‌’ వస్తున్నాడు

Jun 22 2022 7:46 AM | Updated on Jun 22 2022 8:26 AM

Sivakarthikeyan Prince Movie Releasing Worldwide This Diwali - Sakshi

వినాయక చవితికి రావాల్సిన ప్రిన్స్‌ దీపావళికి వస్తున్నాడు. తమిళ హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ దర్శకుడు కేవీ అనుదీప్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘ప్రిన్స్‌’. ఉక్రెయిన్‌ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సోనాలీ నారంగ్‌ సమర్పణలో డి. సురేశ్‌బాబు, సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. కాగా ‘ప్రిన్స్‌’ సినిమాను  వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్‌ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సహనిర్మాత: అరుణ్‌ విశ్వ.  

Advertisement
 
Advertisement
Advertisement