అందుకే ఆ అమ్మాయిని లవ్ చేశా.. ఆసక్తికరంగా ‘ప్రిన్స్‌’ ట్రైలర్‌ | Siva Karthikeyan Latest Movie Prince Telugu Trailer Released By Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

Prince Telugu Trailer: విదేశీ అమ్మాయితో ప్రేమకథ.. ప్రిన్స్ ట్రైలర్ రిలీజ్

Published Sun, Oct 9 2022 9:49 PM | Last Updated on Sun, Oct 9 2022 9:50 PM

Siva Karthikeyan Latest Movie Prince Telugu Trailer Released By Vijay Devarakonda - Sakshi

డాక్టర్, డాన్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్‌. శివ కార్తికేయన్‌, మరియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్‌’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్‌ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ తెరకెక్కించారు.

'రేయ్‌ కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మనందరిదీ ఒకే రక్తం రా' అన్న సత్యరాజ్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. జెస్సికా అనే బ్రిటీష్ అమ్మాయిని శివ కార్తికేయన్ ప్రేమించే ఆసక్తికర కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో అతను తన ప్రేమ గెలిచాడా? అతను పడ్డ ఇబ్బందులు ఎంటీ? కథ ఎలాంటి ఆసక్తికర మలుపులు తిరిగిందో తెరపై చూడాల్సిందే. ట్రైలర్‌ చూస్తే కామెడీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 21న దిపావళీకి థియేటర్లలో కనువిందు చేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement