ప్రముఖ బ్యానర్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా

Sithara Entertainments Announces New Films With Vaishnav Tej - Sakshi

మెగా మేనల్లుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు(జనవరి 13) వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా చిత్రనిర్మాత నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త  మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.  ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో  నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ' డిజే టిల్లు', చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top