అది నా డీఎన్‌ఏలోనే ఉంది.. ఎమోషనల్‌ అయిన సితార | Sitara Ghattamaneni Emotional Post On Mahesh Babu And Superstar Krishna, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Sitara Ghattamaneni Emotional Post: అది నా డీఎన్‌ఏలోనే ఉంది.. ఎమోషనల్‌ అయిన సితార ఘట్టమనేని

Oct 14 2023 9:26 AM | Updated on Oct 14 2023 11:40 AM

Sitara Ghattamaneni Emotional - Sakshi

టాలీవుడ్​ ప్రిన్స్‌​ మహేశ్​ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఆమె పేరొక ప్రభంజనం కాబోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖల పిల్లలకు భిన్నంగా తన మార్క్‌ను చూపిస్తుంది. అలా తనకంటూ ఓ ఫ్యాన్​ బేస్​ను కూడా సొంతం చేసుకుంది. సామాజిక సేవలో నాన్న బాటలోనే నడుస్తానని చెప్పినట్లుగానే తన అడుగులు పడుతున్నాయి.

(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌)

శుక్రవారం నేషనల్‌ సినిమా డే సందర్భంగా సితార ఒక ఫోటోతో పాటు కొన్ని విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదంటూ  సితార పేర్కొంది. సినిమా అనేది తన డీఎన్‌ఏలోనే ఉందని ఆమె తెలిపింది. 'లెజండరీ, ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అంతే. నాన్నే నా స్ఫూర్తి.' అంటూ సితార ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

(ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్‌ అయిన తమన్నా..)

ప్రస్తుతం ఇదీ నెట్టింట వైరల్‌గా మారింది. వయసులో సితార చిన్నపిల్ల అయినా ఆలోచనలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చలనచిత్ర రంగంలోకి తప్పకుండా  అడుగుపెడతానని సితార గతంలో తెలిపిన విషయం తెలిసిందే.. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement