Singer Revanth And Wife Anvitha Expecting Thier First Child, Deets Inside - Sakshi
Sakshi News home page

Singer Revanth: 'ఈ క్షణంలో బిగ్‌బాస్‌కి వెళ్లడం బాధగా ఉంది.. ఆమెను మిస్‌ అవుతా'

Sep 5 2022 1:51 PM | Updated on Sep 6 2022 2:57 PM

Singer Revanth And Wife Anvitha Expecting Thier First Child - Sakshi

సింగర్‌ రేవంత్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి చిత్రంలోని మనోహరీ.. పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ దక్కించుకున్న రేవంత్‌ 2017లో ఇండియన్‌ ఐడల్‌-9లో పాల్గొని టైటిల్‌ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌-6లో 21వ కంటెస్టెంట్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లేముందు ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసుకున్న రేవంత్‌ ముఖ్యంగా తన భార్యను మిస్‌ అవుతున్నట్లు ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

రేవంత్‌కి ఇటీవలె అన్విత అనే అమ్మాయితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికప్పుడు అన్వితతో కలిసి ఉన్న క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు రేవంత్‌. అయితే ప్రస్తుతం రేవంత్‌ భార్య అన్విత ఆరు నెలల గర్భంతో ఉంది. ఇలాంటి సమయంలో తన పక్కన లేకుండా బిగ్‌బాస్‌లోకి వెళ్లడం కొంచెం బాధగా ఉందంటూ రేవంత్‌ స్టేజ్‌పైనే ఎమెషనల్‌ అయ్యాడు.

కాగా రేవంత్‌ భార్య అన్విత కూడా షోలో కనిపించి భర్తకు బెస్ట్‌ విషెస్‌ తెలిపింది. ఇక రేవంత్‌ త్వరలోనే తండ్రి కానుండటంతో సోషల్‌ మీడియా వేదికగా ఈ దంపతులకు నెటిజన్లు కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స​ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement