ఆయన లేకుండా నా కెరీర్‌ ఊహించుకోలేను.. సిమ్రాన్‌ భావోద్వేగం | Actress Simran Mourns The Death Of Her Manager M Kamarajan, Emotional Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Simran On Her Manager Death: షాకింగ్‌ న్యూస్‌.. అస్సలు నమ్మలేకపోతున్నాను.. ఇంత త్వరగా..

Published Fri, Dec 8 2023 12:57 PM

Simran Mourns the Death of Her Manager M Kamarajan - Sakshi

హీరోయిన్‌ సిమ్రాన్‌ మేనేజర్‌ ఎమ్‌.కామరాజన్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. దాదాపు 25 ఏళ్లుగా హీరోయిన్‌ దగ్గర పని చేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిమ్రాన్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను, షాకింగ్‌గా ఉంది. నా ప్రియ మిత్రుడు ఎమ్‌. కామరాజన్‌ ఇక లేరు. ఆయన 25 ఏళ్లుగా నా కుడి భుజంగా ఉన్నారు. ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. చాలా చురుకైన వ్యక్తి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు, నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేకుండా నా సినీప్రయాణాన్ని ఊహించుకోలేను.

ఎంతో మిస్‌ అవుతాం..
ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మిమ్మల్ని ఎంతగానో మిస్‌ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌కు మేనేజర్‌ కామరాజన్‌ ఫోటోను జత చేసింది. కాగా సిమ్రాన్‌ సనమ్‌ హర్‌జై అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో 15కు పైగా సినిమాలు చేసినప్పటికీ తమిళ, తెలుగు భాషల్లోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌..
మా నాన్నకి పెళ్లి, కలిసుందాం రా, నరసింహ నాయుడు, నువ్వు వస్తావని, మృగరాజు, సమరసింహా రెడ్డి, సీతయ్య, డాడీ, ప్రేమతో రా.. ఇలా అనేక సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరైంది. ఆమె కొన్నేళ్ల క్రితం నటించిన ధ్రువ నక్షత్రం ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది. అలాగే శబ్ధం, అంధగన్‌, వనంగముడి అనే తమిళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

చదవండి: తిరుపతిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement