తిరుపతిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం | Sakshi
Sakshi News home page

తిరుపతిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం

Published Fri, Dec 8 2023 10:35 AM

Bigg Boss Fame Vasanthi Krishnan Engaged With Pawan Kalyan - Sakshi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్‌కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. షోలో తన అందచందాలతో మరింత పాపులారిటీని క్రియేట్‌ చేసుకుంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో తన గ్లామర్‌తో మెప్పించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తితో వాసంతి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. డిసెంబర్‌ 7న జరిగిన ఈ కార్యక్రమానికి బిగ్‌ బాస్‌,బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. వాసంతి పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తే... వారిద్దరూ ప్రేమించి ఆపై పెద్దలను ఒప్పించి ఒకటి కాబోతున్నారు. పవన్‌ కూడా ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన వాసంతి.. తన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం కూడా తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకలో శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, ఆర్జే సూర్య, గీతూ రాయల్, ఇనాయ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. మరికొందరు ఇన్‌స్టా ద్వారా వారిద్దిరికి శుభాకాంక్షలు తెలిపారు. వాసంతి, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అని సమాచారం.. ఇదే ఏడాదిలో మొదలైన వారిద్దరి ప్రేమ ఇలా పెళ్లికి ప్రథమ అడుగు పడింది. త్వరలో పెళ్లి ఎప్పుడు అనేది కూడా వాసంతినే ప్రకటించనుంది.

అయితే బిగ్‌బాస్‌కు ముందు వాసంతి ఓ సీరియల్‌తో పాటు రెండు చిన్న సినిమాలలో నటించింది. సిరిసిరి మువ్వలు అనే సీరియల్‌తో  తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాసంతి.. గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్‌లో ఈమె నటించింది. సంపూర్ణేష్‌తో కలిసి ఓ మూవీలో నటించిన వాసింతి కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటించడం విషేశం.

Advertisement
Advertisement