మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు: సిద్ధార్థ్‌ కుటుంబం

Sidharth Shukla Family Issues First Statement After His Death - Sakshi

బాలీవుడ్‌ నటుడు , బిగ్‌బాస్‌ 13 విజేత సిద్ధార్థ్‌ శుక్లా సెప్టెంబర్‌ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.  40 ఏళ్ల ఈ నటుడి మరణవార్త విని ఎందరో బాలీవుడ్‌ ప్రముఖులు, అతని అభిమానులు షాక్‌కి గుర​య్యారు. ఈ క్రమంలో నటుడి అంత్యక్రియల అనంతరం అభిమానులు, సన్నిహితులను ఉద్దేశించి సిద్ధార్థ్‌ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సిద్ధార్థ్‌ మరణంతో తాము షాక్‌లో ఉన్నామని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అతని జీవితంలో భాగమైన అందరికి సిద్ధార్థ్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సిద్ధార్థ్‌ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్‌)

"సిద్ధార్థ్‌ జీవితంలో భాగమై, అంతులేని ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. సిద్ధార్థ్‌ ఎల్లప్పుడూ మన గుండెల్లోనే నిలిచి ఉంటాడని’’ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సిద్ధార్థ్‌ తన ప్రైవసీకి ఎంతో విలువ ఇచ్చేవాడని, తాము అలాగే ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ విషయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని సిద్ధార్థ్‌ కుటుంబ సభ్యులు కోరారు. అతని అంతిమయాత్రకు సంబంధించి ఎంతో ఓపికతో వ్యవహారించిన ముంబై పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్థ్‌ కుటుంబ సభ్యులు. (చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు')

హిందీలో హిట్‌ సీరియల్‌ బాలిక వధుతో గుర్తింపు పొందిన సిద్ధార్థ్‌ శుక్లా అంత్యక్రియల్లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతోమంది సెలబ్రీటీలు సంతాపం తెలిపారు.  సిద్ధార్థ్‌ మరణ వార్త తెలిసి అతని ప్రేయసీ, బిగ్‌బాస్‌ 13 పార్టిసిపెంట్‌ షెహనాజ్‌ కంటతడి పెట్టిన వీడియోలు నెటిజన్లను కలిచివేశాయి. వారిద్దరూ ఆ షో నుంచి "సిద్నాజ్‌"గా గుర్తింపు పొందారు. కాగా, వరుణ్‌ ధావన్‌, అలియా భట్‌ జంటగా నటించిన హంప్టీ శర్మకి దుల్హనియా సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన సిద్ధార్థ్‌ అనతరం కొన్ని ప్రైవేట్‌ వీడియోల్లో నటించాడు. అందులో రెండింట్లో తన ప్రేయసి షెహనాజ్‌తో చేశాడు. సిద్ధార్థ్‌ తండ్రి చినప్పుడే మరణించగా ప్రస్తుతం తల్లితో పాటు ఇద్దరు అక్కలు ఉ‍న్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top