చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు: సిద్ధు జొన్నలగడ్డ | Siddu Jonnalagadda Speech At Committee Kurrollu Trailer Release Event | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైంది: సిద్ధు జొన్నలగడ్డ

Jul 27 2024 10:49 AM | Updated on Jul 27 2024 11:01 AM

Siddu Jonnalagadda Speech At Committee Kurrollu Trailer Release Event

‘‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్‌ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైంది. విజువల్స్‌ బాగున్నాయి. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం... మరో సినిమాకి ఎక్కువ ఖర్చు పెడతాం... అంతే’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘కొత్తవారితో ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి మంచి చిత్రాన్ని తీయడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా పని చేస్తున్నాం. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు’’ అన్నారు నిహారిక. ‘‘నిహారిక, ఫణిగార్లు లేకపోతే ఇంత మంచి సినిమా తీసేవాళ్లం కాదు’’ అన్నారు యదు వంశీ. ‘‘మంచి సినిమా తీశాం. అందరూ చూడండి’’ అన్నారు నిర్మాత ఫణి అడ΄ాక. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌ రమేశ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుదీప్‌ దేవ్, కెమెరామేన్‌ రాజు మాట్లాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement