Shruthi Haasan: రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ చిత్ర రీమేక్‌లో శృతిహాసన్‌? 

Is Shruthi Haasan In Rajinikanth, Kamal Haasan Aval Appadithan Remake - Sakshi

అగ్ర కథానాయకులు కమల్‌ హాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆరంభ దశలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వాటిలో కొన్ని కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ చిత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలు, హీరోయిన్‌ కథా చిత్రాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘అవళ్‌ అప్పడిదాన్‌’. అందులో కమలహాసన్, రజనీకాంత్, శ్రీప్రియ ప్రధాన పాత్ర పోషించారు. సీ.రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ పలు సమస్యలను ఎదురొడ్డి ఎలా నెగ్గుకొచ్చింది అన్నదే ఈ చిత్ర కథ.

చదవండి: తారక్‌పై ట్వీట్‌ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే..

అందులో కథానాయకి పాత్రలో శ్రీప్రియ నటించింది. కాగా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అధర్వ, సమంత జంటగా బానాకాత్తాడి చిత్రాన్ని తెరకెక్కించిన బద్రి అవళ్‌ అప్పడిదాన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే ఇటీవల స్వయంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నటి శ్రీప్రియ పాత్రలో శృతిహాసన్, రజనీకాంత్‌ పాత్రలో శింబు, కమలహాసన్‌ పాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌లను నటింప చేయడానికి ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక  ప్రకటన వెలువడాల్సి ఉంది.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top