Ameesha Patel: తారక్‌పై ట్వీట్‌ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే..

Ameesha Patel Tweet About Jr NTR Goes Wrong on Tag - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ట్వీట్‌ చేస్తూ పప్పులో కాలేసింది బాలీవుడ్‌ నటి అమీషా పటెల్‌. తారక్‌ సరసన ఆమె నరసింహుడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేస్తూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు త్రోబ్యాక్‌ వీకెండ్‌ అంటూ ట్వీట్‌ చేసింది. ‘తారక్‌తో నేను నటించిన చిత్రంలోని(నరసింహుడు) క్యూట్‌ పిక్‌ ఇది. అప్పుడు తెలుగు సూపర్ స్టార్స్‌లో ఒకరైన ఆయన ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను పొందుతున్నారు.

చదవండి: రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరం చిత్రం, 3 రోజుల్లోనే ఎంతంటే..

ఇది నాకు చాలా సంతోషాన్నిఇస్తుంది. లవ్లీ కో-స్టార్‌. ఒదిగిపోతూ కష్టపడే వ్యక్తిత్వం ఆయనది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్న.. ఆమె చేసిన పోరపాటుతో నెటిజన్లు తనని ట్రోల్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తొలుత ఆమె ట్వీట్‌ చేస్తూ తారక్‌(@tarak999) అసలు ట్వీట్‌కు బదులు తారక్‌ ఫ్యాన్స్‌తో ఉన్న @jrntrఫేక్‌ ప్రోఫైల్‌ను ట్యాగ్‌ చేసింది. అయితే ఇది గమనించిన ఆయన ఫ్యాన్స్‌ ఏంటీ మేడమ్‌ కాస్తా చూసుకోవాలి కదా’ అంటూ ఆమె ట్వీట్‌పై కామెంట్స్‌ చేశారు.

చదవండి: లారెన్స్‌ షాకింగ్‌ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’

మేడం ఇది తారక్‌ అన్న అసలు ప్రోఫైల్‌ కాదు.. తప్పు ఖాతా ట్యాగ్‌ చేశారు. సరి చూసుకోండంటూ నెటిజన్లు అమీషాకు సూచించారు. దీంతో తన తప్పు చేసుకున్న ఆమిషా ఆ ట్వీట్‌ను తొలగించి మరో ట్వీట్‌ చేసింది. అయితే రెండొసారి కూడా తప్పుగా ట్యాగ్‌ చేయడంతో ట్రోల్స్‌ బారిన పడింది. దీంతో మూడోసారి కేవలం తారక్‌ పేరు మాత్రమే ఉంచి ఎలాంటి ట్యాగ్స్‌ ఇవ్వకుండ జాగ్రత్త పడింది. కాగా అమీషా తెలుగులో  పవన్‌ కల్యాణ్‌తో బద్రి, మహేశ్‌ బాబు సరసన నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top