Raghava Lawrence: లారెన్స్‌ షాకింగ్‌ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’

Raghava Lawrence Announce He Will Now Fall on The Feet Of Whoever Help Him - Sakshi

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌లో ఇటీవల చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఆయన సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహించడంతో పాటు తన ట్రస్టు ద్వారా ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు. అయితే ఆయన ట్రస్ట్‌కు ఇప్పటివరకు ఎందరో దాతలు ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. అయితే ఇకపై తన ట్రస్ట్‌కు ఎవరి నుంచి ఆర్థిక సాయం వద్దని రీసెంట్‌గా లారెన్స్‌ విజ్ఞప్తి చేస్తూ మీడియా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో ఆసక్తికర ప్రకటన ఇచ్చారు.

చదవండి: డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్‌’ నుంచి తప్పుకున్న హీరోయిన్‌!

ఇకపై తాను ఎవరికీ ఎలాంటి సాయం చేసినా వారి కాళ్లకు తానే నమస్కరిస్తానని చెప్పారు. ఈ మార్పు కోసం తాను చాలాకాలంగా ఎదురుచూస్తున్నానన్నారు. ఓ కుటుంబం తనబిడ్డ గుండె శస్త్ర చికిత్స కోసం తన వద్దకు వచ్చి నప్పుడు సాయం అందించానని.. ఆ సమయంలో వారు తనకాళ్లకు నమస్కారం పెట్టారన్నారు. సాధారణంగా ఏ బిడ్డ అయినా తన తండ్రినే హీరోగా భావిస్తారన్నారు. అలాంటిది బాధితులు తన కాళ్లకు నమస్కరించినప్పుడు వారి బిడ్డల మనసు వేదన చెందుతుందన్నారు. అందుకే ఇకపై సేవలు అందించిన వారి కాళ్లకు తానే నమస్కరించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇదే విషయాన్ని తన అభిమానులు ముందు కూడా స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. 

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్‌, టాలీవుడ్‌ తారల సందడి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top